The Moon: రాత్రిపూట చంద్రుడు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాడు. ఇలా ఎందుకు కనిపిస్తాడు రకరకాల పురాణాలు మతాలు రకరకాలుగా చెప్తున్నాయి.
చంద్రుడు ఎలా పుట్టాడు అనేది మహాపురాణంలో వ్రాయబడి ఉంది. ఒక ఖగోళ వస్తువు భూమిని ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుంచి చంద్రుడు ఏర్పడిందని మహాపురాణంలో వ్రాయబడింది . ఈ గుద్దుకున్న వస్తువును గ్రీకులు తియా అనే దేవత పేరట పూజిస్తూ ఉంటారు.
2016 లో చంద్రుడు పై ఒక పరిశోధన జరిగింది. ఈ పరిశోధన కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు ఏమిటంటే ఏదో ఒక వస్తువు బలముగా చంద్రుని ఢీకొనిందని దాని ద్వారా అనేక ముక్కలు చంద్రులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమి మీద నీరు రూపంలో ఉండేది. ఒక బలమైన శక్తి ద్వారా అది భూమి నుంచి విడిపోయి చంద్రుని ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
మరి కొంతమంది చంద్రుడు వేరే దగ్గర పుట్టిందని భూమి పుట్టినప్పుడు దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన చంద్రుని భూమి మీదకి లాక్కు ఉందని తెలియజేస్తున్నారు. జులై 20వ తారీకు నా ప్రతి సంవత్సరము చంద్రుని యొక్క మహా దినోత్సవం గా జరుపుకుంటారు. అన్ని గ్రహాల కన్నా చంద్రుడు రాత్రి కాల సమయంలో ఎక్కువ కాంతిని ప్రసరింప చేస్తాడు.
అయినప్పటికీ అది స్వయంగా కాంతిని విడుదల చేయదు. సూర్యకాంతిని ఉపయోగించుకుని మాత్రమే చంద్రుడు కాంతిని విడుదల చేస్తుంది. ఆకాశంలో భూమిపై రకరకాల ఉపగ్రహాలు ఉన్నప్పటికీ మనము భూమి మీద ఒక చంద్రుడి మాత్రమే చూడగలము. మిగతా వేటివి మనము చూడలేము.
భూమి యొక్క ఉపగ్రహం కేవలం చంద్రుడు మాత్రమే. సౌర కుటుంబంలో చంద్రుడు లాంటి చంద్రులు సుమారుగా 200 ఉన్నాయి. చంద్రుడి యొక్క పరిమాణము భూమిలో పావు వంతు భాగం ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఈ విధంగా తిరిగేది 27.3 రోజులు పడుతుంది.
చంద్రుని యొక్క ఆకారం: చంద్రుడు మన కంటికి పూర్తిగా గుండ్రంగా కనిపిస్తాడు. కానీ అది గుడ్డు ఆకారానికి దగ్గరగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.చంద్రుడు యొక్క ఒక భాగం మాత్రమే భూమి వైపుకు ఉంటుంది.మరియొక భాగము అది మనకు కనిపించదు.
చంద్రునిలో రంధ్రాలు : ఒకసారి మనము చంద్రుని పరిశీలించినట్లయితే అందులో తోకచుక్కలు, గ్రహశకలాలు, చంద్రుని తాకి అందులో రంధ్రాలు ఏర్పడినట్టుగా మనము చూస్తాము.
చంద్రునిపై ఎత్తైన పర్వతం : చంద్రుడిపై ఒక ఎత్తైన పర్వతం ఉంది.అది 18వేల అడుగులు. దీని పేరు మోన్స్ హుజెన్స్.
చంద్రునిపై ఎత్తైన ప్రదేశం : చంద్రునిలో అత్యంత ఎత్తైన ప్రదేశం ఉంది. అది ఎవరెస్టు శిఖరం కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ ప్రదేశం దాదాపుగా 35,387 అడుగుల ఎత్తు ఉంటుంది.
చంద్రుడిపై వాతావరణం : చంద్రునిపై అణువులు చాలా తక్కువగా ఉంటాయి. ఒక క్యూబిక్ సెంటీమీటర్ కు 100 అణువుల కంటే తక్కువగా ఉంటుంది. అందువలన చంద్రుడు చాలా సన్నగా ఉంటాడు.
చంద్రునిపై ఉష్ణోగ్రతలు : చంద్రుని పై ఉష్ణోగ్రతలు పగలు రాత్రి తేడాలు ఉంటాయి. పగటిపూట ఉష్ణోగ్రత 273 ఫారెన్ హీట్ డిగ్రీ లు ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 243 ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది.
చంద్రునిపై అగ్నిపర్వతాలు : డైనోసార్లు నివసించే సమయంలో చంద్రుడు పై అగ్నిపర్వతాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అప్పటి కాలంలో చంద్రుడిపై వాతావరణము మందపాటి గా ఉండేదని కనుకొన్నారు.
చంద్రునిలో ఉన్న వాయువులు : ఒకప్పుడు చంద్రుని యొక్క వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్, నీరు మరియు సల్ఫర్ ఉండేదని తెలియజేశారు.
భూమికి చంద్రునికి మధ్య గల దూరం : భూమి నుండి చంద్రుడికి దరిదాపుగా 384,400 కిలోమీటర్లు ఉంటుంది.
సూపర్ మూన్: భూమి నుంచి పైకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటగా పెరిగి అనే చంద్రుడు మనకు కనిపిస్తాడు ఇది భూమి నుంచి పెరిజి అనే చంద్రునికి 2,25700 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి చంద్రుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది.ఈ ప్రదేశంలో చంద్రుడిని సూపర్ మూన్ అని పిలిచారు.
మైక్రో మూన్ : అపోజి అనే చంద్రుని వద్ద నుంచి చంద్రుని గనక చూసినట్లయితే చాలా చిన్నదిగా కనిపిస్తాడు. ఎందుకంటే అక్కడ నుంచి 252,000 km దూరంలో చంద్రుడు ఉంటాడు. ఆ ప్రదేశంలో చంద్రుని మైక్రో మూన్ అని పిలుస్తారు. సూపర్ మూన్ మైక్రో మూన్ కంటే పెద్దదిగా ప్రకాశవంతంగా ఉంటుంది.
చంద్రుని యొక్క కక్ష : చంద్రుడు తన కక్షను ప్రారంభించిన తర్వాత చంద్రునికి మరియు భూమికి మధ్య దూరము సంవత్సరానికి 1.5 అంగుళాలు పెరుగుతూ ఉంటుంది.
చంద్రుని యొక్క రంగు: చంద్రుని యొక్క రంగు చూడటానికి బూడిద రంగులో కనిపిస్తుంది. దానికి గల కారణము అందులోని దూళికణాలు నీలిరంగులో కనిపించే విధంగా చేస్తాయి.
బ్లూ మూన్ అంటే దాని అర్థం : బ్లూ మూన్ కి అసలు నీలిరంగు అసలు ఉండదు. దీని అర్థం ఏమిటంటే క్యాలెండర్ నెలలో వచ్చే రెండవ పౌర్ణమి అని అర్థం.
చంద్రుడు భూమిని ఢీ కొంటే : ఒకవేళ చంద్రుడు గనక భూమిని డీ కొంటే మొట్టమొదటిగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల చంద్రుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. అయితే చంద్రుని లో ఉన్న శిధిలాలు వర్షం పడడం కారణంగా భూమి మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందువలన నా జీవరాశులన్నీ చనిపోతాయి.
చంద్రుని యొక్క ఉపయోగం : ఒకవేళ చంద్రుడు గనక లేకపోతే భూమి మీద ఒక వాతావరణము తన నియంత్రణలో ఉండదు. అందువలన మనుషులు జీవించడానికి చాలా కష్టతరమైపోతుంది. చంద్రుని యొక్క ఉపయోగం ఏమిటంటే వాతావరణన్ని చంద్రుడు నియంత్రిస్తూ ఉంటాడు.
చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి : చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి కంటే ఆరవ వంతు ఉంటుంది. అందువలన చంద్రునిపై మీరు అడుగుపెట్టిన వెంటనే మీరు గాలిలో ఏ విధంగా తేలిపోతుంటారో అదే విధముగా తేలాడుతూ కనిపిస్తారు.
సముద్రంలో అలలను మనము గమనిస్తూ ఉంటాము. చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారానే ఈ అలలు చంద్రుడు నియంత్రిస్తూ ఉంటాడు. ఒకవేళ చంద్రుడు తన నియంత్రణ లోకి రాకపోతే గొప్ప సునామీలు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి.
భూకంపాలు సంభవించుటకు గల కారణం :
సముద్రంలో ఉన్న అలల తాకిడి వలన భూకంపాలు సంభవిస్తాయి. చంద్రుడిలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి వలన అలలు వస్తాయి. దీనివలన సముద్రపు యొక్క అలల శక్తి ద్వారా ఒక గంట వరకు భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది.
టైడల్ బ్రేకింగ్ : భూమి తన చుట్టూ తన తిరుగుతుంది. అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది.చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరిగే యొక్క క్రమాన్ని చంద్రుడు నెమ్మదిగా తిరిగే విధంగా చేస్తుంది. దీనినే టైడల్ బ్రేకింగ్ అంటారు.
పగలు అధికమవడానికి గల కారణం : కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం పగలు 10 గంటలు మాత్రమే ఉండేది. కాలక్రమేనా చంద్రుడు భూభ్రమణాన్ని తగ్గించినందున పగలు ఎక్కువగా మారింది.
మానవుడు అడుగు పెట్టిన మొట్టమొదటి స్థలం :
మన గ్రహం నుంచి మరియొక గ్రహానికి మొట్టమొదటిగా అడుగుపెట్టిన మొట్టమొదటి స్థలం చంద్రుడు.
సోవియట్ అంతరిక్ష నౌక : 1959లో మొట్టమొదటిసారిగా చంద్రుని వైపుకి సోవియట్ అంతరిక్ష నౌకను పంపించారు.అప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రుని యొక్క అవతల భాగము ఎలా ఉందో చూశారు.
చంద్రునిపై అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి :
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై జూలై 21,1969 న మొట్టమొదటిసారిగా చంద్రునిపై నడిచాడు. చంద్రుడిపై నడిచే వీడియోను 500 మిలియన్లు మంది వీక్షించారు.
చంద్రునిపై అమెరికన్ జండా చిత్రాలు :
చంద్రునిపై అడుగుపెట్టినప్పుడు అమెరికన్ యొక్క జెండాలు గాలికి ఊగుతున్నట్లుగా చూపించారు. కానీ వాస్తవానికి ఆ జెండాలు సరిగ్గా అమర్చుకపోవడంతో అది అలల ప్రభావం చేత అది గాలికి ఊగినట్లుగా కనిపించింది.
చంద్రునిలో ఉన్న సామాగ్రి : చంద్రునిలో ఉన్న ఇసుకను మరియు రాళ్ళను అపోలో మిషన్లు తీసుకుని భూమి మీదికి వచ్చాయి. ఈ రాళ్లు మరియు ఇసుక మొత్తము 842 పౌండ్లు ఉంటుంది.
మూడు అంతరిక్ష రోబోటిక్ నౌకలు : ప్రస్తుతం నాసా వద్ద 3 అంతరిక్ష రోబోటిక్ నౌకలు ఉన్నాయి. మొదటిది ఆర్ట్ మిస్ ట్విన్స్. రెండవది లూనార్ రికనైసెన్స్. మూడోది ఆర్బిటర్ అంతరిక్ష నౌక.
చంద్రుని పై నడిచిన వారు : అపోలో 17 మిషన్ తర్వాత మానవులు ఎప్పుడు చంద్రుని వద్దకు వెళ్లలేదు. చంద్రుని వద్దకు ప్రజలను విజయవంతంగా తీసుకెళ్లిన ఒకే ఒక దేశం పేరు అమెరికా. మొత్తం 24 మంది చంద్రుని వద్దకు వెళ్లారు. 12 మంది మాత్రమే చంద్రుని మీద నడిచారు.
అపోలో వాసన : అంతరిక్షంలోనికి ప్రయాణించిన వ్యోమగాములు చంద్రునిలో ఉన్న ధూళిని రుచి చూశారు. దీనిని అపోలో వాసన అని పిలిచారు.
చంద్రుని యొక్క దూళి లక్షణాలు :
చంద్రుని మీద ఉన్న దూళిని మనము గనక ఉపయోగించిన లేదా కాల్చినట్లయితే గన్ పౌడర్ లాంటి వాసన వస్తుంది. ఇది మన శరీరానికి ఉపయోగించినట్లయితే ఊపిరితిత్తులు నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ దూలిని మనము తాకినప్పుడు చాలా మృదువుగా ఉంటుంది.
బృహస్పతి భార్య పేరు తార. ఈమె చాలా అందగత్తె. ఒక రోజున బృహస్పతి పని మీద బయటకు వెళ్తాడు. ఆ సమయంలో తారా చంద్రుని ఒకసారి చూస్తుంది. అప్పుడు చంద్రుని నాకంటే చాలా అందంగా ఉంది ఒకసారి చంద్రునితో నేను కూడాలి అని అనుకొని చంద్రునితో కూడుతుంది. అప్పుడు చంద్రునికి తారకు బుధుడు పుడతాడు. అప్పుడు చంద్రుడు నాకు పుట్టిన కుమారుడు బుధుడు కనుక నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి చంద్రుడు బుధుడిని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు చంద్రుడికి తారకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో న్యాయం తీర్చడానికి బ్రహ్మదేవుడు దిగివస్తాడు. అప్పుడు విషయం అడిగి తెలుసుకుని బుధుని చంద్రుడికి అప్పగిస్తాడు. తారను బృహస్పతికి అప్పగిస్తాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు వారికి న్యాయం చేస్తాడు.
పురాణాలలో చంద్రుని యొక్క మరో పేర్లు :
పరమశివుడు శిరస్సు మీద ఒక అలంకారముగా చంద్రుడు భావిస్తాడు అందువల్ల చంద్రుడుని చంద్రమౌళి లేదా చంద్రశేఖరుడు అనే పేర్లతో పిలుస్తారు.
చంద్రోదయం : ప్రతిరోజు చంద్రుడు తూర్పు నుంచి పడమటి వరకు పయనిస్తూ ఉంటాడు. కానీ సూర్యకాంతి చంద్రుని కాంతి కంటే అధికముగా ఉండడాన్ని బట్టి చంద్రుడు మనకి కనిపించడు. రాత్రి సమయంలో మాత్రమే చంద్రుడు మనకు సంపూర్ణంగా కనిపిస్తాడు. దీనినే చంద్రోదయం అంటారు.
చంద్రగ్రహణం : చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడకుండా డైరెక్ట్ గా భూమి మీద పడినట్లయితే అప్పుడు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు.దీనిని చంద్రగ్రహణం అంటారు.
.