మేష రాశి యొక్క జన్మస్థానం : ఎవరైతే మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వరకు పుట్టి ఉంటారో వారు మేషరాశిలో జన్మించిన వారు అవుతారు.
వివాహ పరముగా :
మేషరాశిలో పుట్టిన వారు ఎవరైతే వివాహము చేసుకుంటారో వారు భర్తను గాని భార్యని గాని ఇరువురు కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.ఇరువురి మధ్య చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకుని చక్కగా పరిష్కరించుకుంటారు.మేషరాశిలో పుట్టిన వారు ప్రేమలో గాని పడినట్లయితే వారు ప్రేమ ఫలిస్తుంది.
ఉద్యోగపరంగా :
ఉద్యోగపరంగా మేషరాశిలో పుట్టిన వారి యొక్క ఫలితములను మనము చూసినట్లయితే వారికి చాలా ఒత్తిళ్లు అయితే కలుగుతాయి కానీ ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు తేలికగా అయితే బయటపడతారు. వారికి మాట్లాడే గుణం ఎక్కువగా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా డెవలప్ చేసుకుంటారు తత్ఫలితంగా వారికి ప్రమోషన్ అనేది వస్తుంది. వారికి బాధ్యతలను కూడా ఎక్కువగా అప్పగిస్తారు. వ్యాపారం ఒకవేళ మొదలుపెట్టినట్లు అయితే వారికి ఎక్కువ లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. నూతన విధానాలను వారు చేపడుతారు. మంచి ఫలితాలను వారు అనుభవిస్తారు.
ఆర్థికపరంగా :
ఇక ఖర్చుల విషయానికొస్తే ఆదాయం వస్తుంది కదా నీ విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఒక లిమిట్ గా కాని ఖర్చు చేసినట్లయితే వారికి ఆదాయం అనేది మిగిలే అవకాశం అయితే ఉంది.
వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఒకరికి డబ్బులు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారికి అయితే ఉండరు. వీళ్ళు ఎవరికైతే అప్పు ఇచ్చుంటారో వాళ్ళ దగ్గర నుంచి అప్ అనేది చాలా సులభంగా రాబట్టుకుంటారు.
ఏదైనా ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వీలకి సరైన అవగాహన అయితే పెద్దగా ఉండదు. అందువలన ఈరోజు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి అయితే వస్తుంది ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు నిర్ణయం అయితే తీసుకుంటారు ఇది మేషరాశిలో ఉన్న వారి యొక్క ఆర్థిక పరిస్థితి. ఈ విధంగా జరుగుతుంది.
ఆరోగ్యపరంగా :
మేషరాశిలో పుట్టిన వారికి మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. దీని విరుగుడుకి యోగ ఆసనాలు, ధ్యానం ఇవన్నీ చేయాలి.
సాధారణంగా ఆరోగ్య0 బాగానే ఉంటుంది. కానీ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి ఇవన్నీ చేయాలి.
మేషరాశిలో పుట్టిన వారు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు తలనొప్పి తర్వాత నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సరదా వాస్తవాలు:
1. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా కూడా నేను అసలు ఈ పని ఏమి చేయలేను అని అంటే వారికి చాలా కోపం వస్తుంది. మేషరాశిలో పుట్టినటువంటి వారు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. చాలా పట్టుదలగా ఉంటారు.
2. ప్రయత్నిస్తారు కానీ గెలుపు ఓటమినేది కచ్చితంగా చెప్పలేము. ఒకవేళ గెలవ లేకపోతే అందులో నుంచి పాఠాలు లు నేర్చుకుంటారు. రెండవసారి ప్రయత్నించేటప్పుడు దుమ్ము దులిపేస్తారు ఇది మేషరాశిలో ఉన్నటువంటి వారి గొప్పతనం.
3. మేష రాసి వారు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు అది మంచిదా చెడ్డదా అని కూడా ఆలోచించినే ఆలోచించరు. ఇది చాలా ప్రమాదానికి దారి తీయవచ్చు. ఏది ఏమైనా ప్రయత్నం అనేది వారి గమ్యం. ముందు వెనుక ఆలోచించకుండా ప్రయత్నిస్తారు ఇది వారి యొక్క లోపం.
4. మేష రాశి వారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. స్నేహితులు అతనుతో సరదాగా గడుపుతారు. పార్టీలో ఎక్కువగా పాల్గొంటారు. మేషరాశిలో పుట్టినటువంటి వారితో స్నేహం చాలా బాగుంటుంది వారే అందరికీ ఖర్చు పెడతారు.
5. మేష రాశి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పట్టుదలగా సాధిస్తారు. కానీ సాధించిన తర్వాత అది వేరే వారు అనుభవిస్తారు వారు దాన్ని అనుభవించలేరు ఇలా చాలాసార్లు మేష రాశి వారిలో జరుగుతూ ఉంటుంది.
6. మేష రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్రమశిక్షణ కలిగి ఉంటారు. వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు.
7. వారు ఏదైనా ఒక అభిప్రాయాన్ని గట్టిగా నమ్మినట్లయితే దాని మీదే నిలబడతారు అంత ఈజీగా అయితే దానిని విడిచిపెట్టరు. అది ఎంత కష్టమైనా కూడా దానిని మీదే ఆధారపడి ఉంటారు.
8. ఒక దీపం ఎలాగైతే వెలిగిపోతుందో అలాగే మేషరాశిలో పుట్టిన వారిని మనము కొంచెం ప్రేమగా మాట్లాడినట్లయితే వారిని ప్రేమించినట్లయితే వారు కూడా అంతగా సంతోషిస్తారు మనకి బాగా ప్రతిస్పందిస్తారు. అంతకంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తారు. ఇటువంటి గుణము మేషరాశి వారిలో కనిపిస్తుంది.
మేష రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు : అత్యాశ: వీరు త్వరగా నిర్ణయాలు తీసుకోవటం వలన ప్రమాదంలో పడిపోతారు అందువలన వారు ఓటమి పాలు అవుతారు ఈ విషయంలో వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
ఓటమిని ఓర్చుకోలేకపోవటం : వారు అనుకున్నది జరగాలని అనుకుంటారు. ఒకవేళ అనుకున్నది జరగకపోతే వారు ఓటమిని ఒప్పుకోలేరు. ఈ విషయంలో ఈ మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
విపరీతమైన కోపం: వీరికి విపరీతమైన కోపం అనేది ఒక పెద్ద బలహీనత. ఈ విషయములో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.