భూమి మీద తప్ప మరి ఏ ఇతర గ్రహాల పైన మానవజాతి నివసించడానికి అవకాశం ఉందా?

అసలు మానవులకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని మానవుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. వేసవి కాలంలో ఎక్కువ ఎండ వస్తే తట్టుకోలేడు.చలికాలంలో ఎక్కువ చలి వస్తే తట్టుకోలేడు. వర్షాకాలంలో ఎక్కువ వరదలు వస్తే ఓర్చుకోలేడు. అందువలన భూమి కంటే ఎక్కడైనా ఏ గ్రహం లో అయినా మెరుగ్గా జీవించడానికి అవకాశం ఉందా లేదా అని ప్రతి గ్రహాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ నివసించడానికి అవకాశం ఉందేమో అని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. అసలు దీనికంటే ముందు భూమిపై మాత్రమే మనము ఎందుకు జీవించగలుగుతున్నాము ఇతర గ్రహాలపై ఎందుకు జీవించలేకపోతున్నాము అన్న విషయాలను మనము ముందు తెలుసుకోవాలి.
భూమి
సూర్యుని యొక్క కిరణాలు భూమి మీదకి పడుతున్నప్పుడు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం మూలంగా భూమికి హాని చేసే సూర్యకిరణాలు భూమికి చేరకుండా కాపాడుతాయి. అంతేకాకుండా భూమికి సూర్యకిరణాలు ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించేటువంటి శక్తిని భూమి కలిగి ఉంటుంది. అది మరి ఏ ఇతర గ్రహాల్లోనూ లేదు.
గోల్డిలాక్స్ జోన్ : భూమి గోల్డ్ లాక్స్ జోన్ లో ఉంది. దీని అర్థం ఏమిటంటే భూమిలో నీరు నిలవ ఉండడానికి సరిగ్గా సూర్యునికి భూమికి మధ్య అనువైన చోటుగా భూమి దాగి ఉంది. మరి ఏ ఇతర గ్రహాల్లో నీరు దాగి ఉండడానికి అనువైన చోటు లేదు.
నీరు దొరికే చోటు: చిన్నచిన్న సూక్ష్మజీవుల నుంచి మానవజాతి వరకు ప్రతి ఒక్క జంతువు జీవించడానికి కచ్చితంగా నీరు అవసరమవుతుంది. ఈ భూమి మీద మాత్రమే నీరు దొరుకుతుంది.మరి ఏ ఇతర గ్రహాల్లో నీరు దొరికేటువంటి అవకాశం అయితే లేదు.
భూమి స్థానం యొక్క ప్రత్యేకత : సూర్యుని యొక్క వేడి నుంచి తట్టుకునే శక్తి భూమికి ఉంది. ఎందుకంటే భూమికి సూర్యునికి మధ్య ఎక్కువ దూరంలో ఉంది. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు భూమి తట్టుకోగలదు. అందువలన అది మానవజాతికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ సూర్యరశ్మి ద్వారా మానవులు జీవించగలుగుతున్నారు.
భూమిలో ఉన్న వాతావరణ మార్పులు : భూమిలో మానవులు జీవించడానికి వర్షాకాలం, వేసవికాలం, చలికాలం, ఈ మూడు కాలాలుగా విభజించబడి ఉంటుంది. అందువల్ల మానవుని యొక్క శరీరానికి అవసరమైన ప్రతి ఒక్కటి ఈ భూమి మీద దొరుకుతుంది. ఇది మరి ఇతర గ్రహాల మీద లేదు.
భూమి పరిపూర్ణమైన ఇల్లు : భూమి మీద మనుషులు జీవించడానికి అవసరమైన ప్రతి ఒక్కటి భూమి మీద మాత్రమే జరుగుతుంది. మానవులకు అవసరమైన ఆక్సిజన్ కార్బన్డయాక్సైడ్, నీరు, గాలి ప్రతి ఒక్కటే భూమి మీద మాత్రమే దొరుకుతుంది. మరి ఏ ఇతర గ్రహాల్లో అనువైన వాతావరణము లేదు.
ఖగోళ శాస్త్రవేత్త చెప్పిన వివరాలు : నోబెల్ బహుమతిని అందుకున్న ఖగోళ శాస్త్రవేత్త అయిన మైకేల్ మేయర్ గారు ఏమని చెప్పాడంటే మరో గ్రహం మీద మనము నివసించడానికి అంత సాంకేతిక పరిజ్ఞానం అయితే ఇంతవరకు లేదు. భూమి మీద ఉన్న వాతావరణము మరి ఏ ఇతర గ్రహాల్లో మనము ఇంతవరకు చూడలేదు. భూమి లాంటి మరొక గ్రహము ఉందా లేదా అని ఖచ్చితంగా మనం చెప్పలేము ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. సూర్యునికి చాలా దూరంలో గోల్డ్ లాక్స్ అనేటువంటి నక్షత్రము కలదు ఈ నక్షత్రము అచ్చం భూమి లాగే ఉంటుంది భూమి మీద ఉన్న వాతావరణ మార్పులు ఆ నక్షత్రం మీద కూడా ఉంటుందా లేదా అనేది అక్కడ చేరుకునేంతవరకు గాని చెప్పలేము. అక్కడ జీవరాశి ఉందా? లేదా అని మనము పరిశీలించి చూడాలంటే, మొదటగా మనము అక్కడికి చేరుకునేటువంటి సాంకేతికత అభివృద్ధి లేదు అని చెప్పారు.
అంగారక గ్రామం పై మానవుల నివసించలేకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి
నేల విషపూరితమైనది : అంగారక గ్రహములో ఉన్నటువంటి నేల మనిషిని యొక్క నివాసయోగ్యానికి అంత మంచిది కాదు. అది ఎంతో విషపూరితమైనదిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు.
గురుత్వాకర్షణ శక్తి తక్కువ: భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ అంగారక గ్రహములో మనము గాని అడుగుపెట్టినట్లయితే అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన ఒక మనిషి అంగారక గ్రహములు అడుగుపెట్టిన వెంటనే గాలిలో ఎలా తేలాడుతామో అలా తేలిపోతూ ఉంటాడు. అక్కడ అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి ఎక్కువ రేడియేషన్ కి గురి అవుతాడు.
నీటి సమస్య : అంగారక గ్రహములో అడుగుపెట్టిన వెంటనే ఎక్కువగా దాహానికి గురి అవుతాము. అక్కడ నీరు త్రాగడానికి ఉండదు. ఎందుకంటే నీరు ఉంటుంది. కానీ అది ద్రవరూపంలో మాత్రమే ఉంటుంది. కచ్చితంగా నీరు అనేది అక్కడ లభించడం కష్టతరమైన పని.
సూర్యకిరణాలు పడకపోవడం : అంగారకరాలలో సూర్యకిరణాలు పడకపోవటం వలన అధికమైన చలి ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రతలు 243 ఫారెన్హీట్ డిగ్రీల నుంచి 143 ఫారెన్ హీట్ డిగ్రీల వరకు పడిపోతుంది. అందువలన విపరీతమైన చలి ఉంటుంది. మనిషి కూడా గడ్డకట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. అక్కడి వాతావరణం చాలా సన్నగా ఉంటుంది.
అంగారక గ్రహం మీద నివసించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి ఎంతవరకు అక్కడ జీవించడానికి చాలా కష్టమని పరిశోధకులు చెబుతున్నారు.

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

Leave a Comment

Top