కుంభరాశి జన్మదినం ఎప్పుడు : కుంభరాశి జన్మదినం ఎప్పుడంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 మధ్యలో మీరు గనక పుట్టినట్లయితే మీరు కుంభరాశి జన్మదినంలో పుట్టిన వారు అవుతారు. కుంభరాశి జన్మదినంలో పుట్టిన వారు నిజంగానే అదృష్టవంతులు అని చెప్పాలి.
కుంభరాశిలో పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది
కుంభ రాశిలో పుట్టిన వారు సమాజంలో మానవతా విలువలను సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడతారు. విపరీతమైన కోపం వారికి ఉంటుంది. స్వతంత్రంగా బతకడానికి ఇష్టపడతారు. వ్యతిరేకమైన స్వభావాన్ని కూడా వారు కలిగి ఉంటారు.స్వతంత్ర భావాలు ప్రకటించడానికి వారు ఎక్కువగా ఇష్టపడతారు.
భవిష్యత్తులో ముందుగానే ఊహిస్తారు :
కుంభ రాశిలో పుట్టిన వారు ముందుగానే భవిష్యత్తును ఊహిస్తారు. వారికి టెక్నాలజీ పక్క మంచి అవగాహన ఉంటుంది. బాగా పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు.
స్వతంత్ర భావన :
ఎవరైనా ఏదైనా సలహాలు చెప్పినప్పుడు ఆ సలహాలను వెంటనే వారు పాటించరు వారు తమ సొంత ఆలోచనను ఆలోచిస్తారు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. వారి ఆలోచనలు పాటించకుండా వారికి కలిగినటువంటి ఆలోచనలను పాటించడానికి ఇష్టపడతారు. దానినే వారు కోరుకుంటారు. దానినే వారు పాటించడానికి వారు ప్రయాసపడతారు.
అందరి పట్ల దయ కలిగిన మనసు ఉంటుంది
కుంభరాశిలో పుట్టిన వారు ఇతరుల పట్ల జాలగలిగిన మనసు ఉంటుంది.ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన ఉంటుంది. ఇతరు యొక్క బాధలు పంచుకొని దయను చూపించేవారుగా,ఓదార్చేవారుగా వారు ఉంటారు.
దాచేస్వభావం కలిగిన వారు :
వారికి ఇన్ని కష్టాలు వచ్చినా వారు ఎమోషన్స్ ని వారు దాచిపెట్టుకుంటారు ఎవరితో ఎక్కువగా తమ బాధల్ని పంచుకోరు. అయితే తమకున్న ఆలోచనలు మాత్రం అమలు చేయాలని ఎక్కువగా ఇష్టపడతారు.
చరిత్రలో కుంభ రాశిలో పుట్టిన వారు
థామస్ ఆల్వా ఎడిసన్, డార్విన్ వీరు కుంభ రాశిలో పుట్టిన వారే. థామస్ ఆల్వా ఎడిషన్ బల్బును కనిపెట్టాడు
కుంభరాశి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి
కుంభరాశి చక్రం యొక్క గుర్తు ఏమిటంటే నీటిని మోసే అటువంటి బాలుడు అని అర్థం. తూర్పు మరియు పశ్చిమ నాగరికతలు కుంభరాశిని నీటితో పోలుస్తారు. హిందూ రాసి చక్రంలో నక్షత్ర రాశి అంటే నీటి కుండ అని అర్థం. బబులోనులో ఉన్న వారి శాస్త్రాల ప్రకారం కుంభ శాస్త్రం అనుకున్నా అర్థం ఏమిటంటే పొంగిపొరలుతున్న తున్న నీటిని పట్టుకున్న దేవుడు అని అర్థం.