మకర రాశి గురించి ఆసక్తికరమైన విషయాలు

ఏ తేదీన పుట్టిన వారికి మకర రాశి వస్తుంది:

సూర్యుని
40 Amazing సూర్యుని వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి
 మీరు డిసెంబర్ 22వ తారీకు నుండి జనవరి 20వ తారీకు మధ్యకాలంలో మీరు జన్మించినట్లయితే మీరు మకర రాశిలో జన్మించిన వారు అవుతుంది.
Interesting facts about Capricorn
Interesting facts about Capricorn
 మకర రాశిలో పుట్టిన వారు పెద్ద పెద్ద కలలను కంటారు. పెద్దపెద్ద లక్ష్యాలను ఎంచుకుంటారు.
 ఆ పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించేంతవరకు దృఢ సంకల్పం కలిగి ముందుకు సాగుతారు.
 అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు.
 మకర రాశిలో పుట్టిన వారు చాలా కష్టపడే పని చేస్తారు. వారు దేనినైతే ఇష్టపడుతున్నారు దానిని పొందుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు.వారు కోరుకున్న లక్ష్యాలను మనము ఆపడం ఆసాధ్యం. వారు ఎవ్వరిని అనుసరించరు. తమ కోరుకున్నది సాధించుకుంటారు.ఇటువంటి వారు జాతీయ స్థాయి స్థానాల్లో చూసేటువంటి అవకాశం ఉంది. 
 వ్యక్తిత్వం : ఈ మకర రాశిలో పుట్టిన వారు ఎక్కువగా పెద్దగా స్నేహితులను వారు కలిగి ఉండరు. కానీ స్నేహభావాన్ని కలిగి ఉంటారు. చాలా మందికి సహాయం చేస్తారు. కలిగి ఉన్నటువంటి స్నేహబంధంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఎప్పుడు ప్రశాంతంగానే ఉండటానికి వారు ప్రయత్నిస్తారు.
 
 మకర రాశి లక్షణాలు  :మకర రాశి భూమి రాశులలో చివరిదిగా ఉంటుందిఈ రాశులలో కొన్ని లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. క్రమశిక్షణ, నిబద్దత, బలము, దృష్టి మరియు శక్తి ఇవి కలిగి ఉంటాయి. కాబట్టి మకర రాశి అనేది అత్యంత కష్టపడి పనిచేసేటువంటి రాసి అని చెప్పడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
 
 మకర రాశి యొక్క గుర్తు : మకర రాసిన గుర్తించడానికి ఉపయోగపడేటువంటి గుర్తు మేక. ఇది సాధారణంగా మనం అనుకునే మేక కాదు పౌరాణిక మకర రాశికి మేక యొక్క గిట్టలు మరియు చేపతోకలను ఇది కలిగి ఉంటుంది. దీని యొక్క నైపుణ్యత ఎంతలా ఉంటుందంటే కఠినమైన భూభాగాలు తట్టుకునేటువంటి శక్తిని ఇదే కలిగి ఉంటుంది. అంతేకాకుండా భూమి యొక్క లోతుల్లోనికి కూడా ప్రయాణించడానికి ఇది వెనుకంజవేయదు.
 
 పురాణాల ప్రకారం గ్రీకు దేవుని పేరు పోసిడాన్ (సముద్రాలుదేవుడు) అంటారు. ఒక రోజు నా పెద్ద తుఫాను వస్తుంది. ఈ తుఫాను బారి నుండి రక్షించుకోవడం కోసం సముద్రాల దేవుడు సగము చేపలాగా సగము మేకలాగా మారి నైలినదిలోనికి దూకి వేస్తాడు. ఈ విధంగా ఆ తుఫాను బారి నుంచి రక్షించబడతాడు.
 
 మకరం అనే పదానికి అర్థం  : మకరం అనే పదము లాటిన్ పదము ” కాప్రికోనస్ అనే పదము నుండి వచ్చింది. దీని అర్థము మేక అని అర్థం.
 
 మకర రాశికి ఉన్న అదృష్టదినము : శనివారం రోజున మకర రాశిని అదృష్ట దినముగా భావిస్తారు.
  మకర రాశిలో పుట్టిన వారికి గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. ఎందుకంటే మకర రాశిలో పుట్టిన వారు ఏదైనా ఒక విషయాన్ని గ్రహించలేని వారు, అర్థం చేసుకోలేని వారిని కనుగొనడం చాలా తక్కువగా ఉంటుంది.
 
 మకర రాశిలో పుట్టిన వారికి చురుకుదనము ఎక్కువగా ఉంటుంది. మీయొక్క ఒక కవళికలను బట్టి  మీరు ఎలాంటి వారో చెప్పేస్తారు. వారు కళ్ళతో చూసి మీ మనసులోని ఉద్దేశాలను కనిపెట్టేస్తారు.
 
 మకర రాశిలో పుట్టిన వారికి ఇంతవరకు మనం మంచి లక్షణాలను మాత్రమే చూశాము. కానీ మకర రాశిలో పుట్టిన వారికి కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి.
 
 వారు తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. తోటి వారిని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వారు అనుకున్న పనిని వెంటనే చేయడానికి మొదలుపెట్టరు. ఎవరిని ఎక్కువగా నమ్మరు. కానీ స్నేహభావమును కలిగి ఉంటారు.
 పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మూడీగా ఉంటారు. చిరాకు, కోపం తెచ్చుకుంటారు. ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శిస్తారు. మకర రాశిలో పుట్టిన వారు ప్రతి విషయాన్ని కూడా రహస్యంగానే ఉంచుకుంటారు. వారు తమ కోరుకున్నటువంటి లక్ష్యాలను సాధించెంతవరకు వారు అనుకున్న భావాలను ఇతరులతో ఎవరితో పంచుకోరు. అనుకున్నది సాధించిన తర్వాత వారు చెప్తారు.
 
 మిచెల్ ఒబామ జనవరి17 1964 లో జన్మించారు. 
 
బాస్కెట్‌బాల్ ప్రో లెబ్రాన్ జేమ్స్ :డిసెంబర్ 30 న జన్మించాడు. నిజమైన మకరరాశి లో పుట్టినవాడు. బాస్కెట్బాల్ ఆడటంలో కష్టపడి పని చేయడం మరియు దృఢమైన సంకల్పంలో లక్ష్యాన్ని సాధించడం కోసం ఇతను పనిచేశాడు.
 
 బ్లూ ఐవీ కార్టర్  : ఈమె జనవరి 7 న జన్మించింది.ఎనిమిదేళ్ల వయసులో BET అవార్డును సాధించింది.
 ఈమె జనవరి 19న జన్మించింది మకర రాశికి చెందినది. ఈమె 1986లో ఒక పెద్ద పార్కును ఈమె ప్రారంభించింది. ఈ పార్కును చూడడానికి విదేశాల నుంచి అనేకమంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ పార్కు టేనస్వీ లోనే theem అనే బాలీవుడ్ పార్కు అంటారు. 
 
తిమోతీ : ఇతను క్రిస్మస్ తరువాత రెండు రోజులకి జన్మించిన ఉత్తమ నటుడు. చిన్న వయసులోనే ఇతను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
 వీరి విజయాలను మనం ఆలోచించినట్లయితే మకర రాశిలో పుట్టిన వారు అత్యంత విజయాలను సాధించిన వారు అవుతారు. లక్ష్యాలలో దృఢంగా చేసుకొని వారు తమ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసమో నిరంతరము ప్రయత్నించే వారిగా మనకు వారు కనిపిస్తూ ఉంటారు. ఈ మకర రాశిలో పుట్టిన వారు అదృష్టవంతులు అని చెప్పాలి.

 

తోకచుక్కలు
20 Amazing తోకచుక్కలు వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు – తప్పక చదవండి

పాలపుంత
15 Amazing పాలపుంత వెనుక ఆసక్తికరమైన వాస్తవాలు- తప్పక చూడండి

Leave a Comment

Top