సింహరాశి యొక్క ఆసక్తికరమైన విషయాలు

By Akira Facts

Updated on:

Follow Us
సింహరాశి ఫలితాలు

సింహరాశి యొక్క ఆసక్తికరమైన విషయాలు

  1. #Leo horoscope results:
  • జన్మస్థానం :ఎవరైతే జులై 23 మరియు ఆగస్టు 22 మధ్యన జన్మించి ఉంటారు ఆ వ్యక్తులు సింహరాశి చక్రానికి చెందినవారు. ఈ చక్రము 5వ రాసిగా పేరుపొందింది.
  •  

 

  • సింహరాశి వ్యక్తిత్వం : ఈ 12 రాజ చక్రాలలో సింహరాశిని మనము గమనించినట్లయితే అది సింహం యొక్క గుర్తు తో ఉంటుంది సింహం అంటే నాయకత్వానికి గుర్తు ఈ సింహరాశిలో పుట్టిన వారు పుట్టుకతోనే నాయకత్వాన్ని కోరుకుంటారు. సింహరాశిని సూర్యుడు పరిపాలిస్తాడు. ఈ సింహరాశిలో పుట్టిన వారికి పదవీ కాంక్ష అధికార దాహం ఎక్కువగా ఉంటుంది.

  •  

    leader

     సింహరాశి వారి యొక్క ప్రవర్తన :

    helpling
  •  

     సింహరాశిలో ఉన్నవారు ప్రతి విషయములో కూడా సృజనాత్మకంగా ఆలోచిస్తారు.ఇతరుల పట్ల చాలా నమ్మకంగా ఉంటారు.దీనివల్ల నైతిక విలువలు వారిద్దరి మధ్య బాగా పెంపొందుతాయి. స్నేహభావం వారి మధ్య బాగా ఉంటుంది. ఎవరైనా సింహ రాశి వారిని కలిసినప్పుడు వారిని ప్రేమించకుండా ఉండడం అనేది చాలా కష్టం ఎందుకంటే వారు ఇతరుల పట్ల చాలా నమ్మకంగా జీవిస్తారు అందువలన సింహరాశిలో ఉన్నవారు ఎక్కువగా కలిసి పోతారు. సూర్యుడు ఎప్పుడు నిరంతరం ఎలా వెలిగిపోతూ ఉంటాడో సింహరాశిలో ఉన్నటువంటి వారు ఇతరులతో సంబంధం లో చాలా హృదయపూర్వకంగా ఉంటారు. హృదయంలో కపటం అనేది వారికి అస్సలు ఉండదు. నటించడం అసలు చేతకాదు. ఇతరుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో అత్యంత నైపుణ్యత కలిగి ఉంటారు.

      సింహరాశి గురించి మీకు తెలియని ఐదు వాస్తవాలు.

  •  

     సింహరాశి యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అంటే కర్కాటక రాశి మరియు కన్యక రాశి మధ్యలో ఉంటుంది. సింహరాశి ఐదవ స్థానంలో ఉంటుంది.

     

     సింహరాశి యొక్క గుర్తు సింహం. మీరు పుట్టినప్పుడు నాయకులు యొక్క లక్షణాలను కలిగి ఉంటారు.

     సింహరాశిని సూర్యుడు పరిపాలిస్తాడు.

     సింహరాశి యొక్క అదృష్ట సంఖ్యలు 1,3,9,10 మరియు 19.

     సింహరాశిలో పుట్టిన వారిని అగ్ని రాశి అని కూడా పిలుస్తారు. సింహరాశిలో పుట్టిన వారు చాలామందిగా ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని సాధించేటప్పుడు చాలా పట్టుదలను కలిగి ఉంటారు.

     సింహరాశి వారి యొక్క బలహీనతలు :

     సింహరాశి వారు లో అనేక మంచి లక్షణాలు ఉన్నప్పటికీ వారిలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి అందులో మొట్టమొదటిగా వారిలో చూడటానికి ఒక అహంకారిగా, మొండి వారిగా కనిపిస్తూ ఉంటారు.

     ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. దాని వల్ల వచ్చిన విమర్శలను ఏమాత్రం తీసుకోరు. ఇది వారికున్న రెండవ బలహీనత.

     సింహ రాశి వారు ఏదైనా సాధించే ప్రక్రియలో తమ పనులు విజయవంతం కావడానికి స్వార్థపరులుగా మారుతారు.

     ఇలా ఉండటాన్ని బట్టి సింహరాశిలో ఉన్న వారు ఇతరులకు కూడా కొన్నిసార్లు శత్రువులుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది.

     సింహరాశి యొక్క వివాహం :

     సింహరాశిలో పుట్టిన వారు ఎవరిని వివాహము చేసుకోవాలంటే మిధున రాశి మరియు కుంభరాశిలో పుట్టినటువంటి వారిని వివాహము చేసుకున్నట్లయితే వారి యొక్క వివాహ దాంపత్యం చాలా అనుకూలంగా ఉంటుంది.

     సింహరాశిలో పుట్టినటువంటి వారు కుంభరాశి వారితో వివాహం చేసుకున్నట్లయితే కొన్ని కొన్ని ఆటంకాలు అయితే వస్తాయి. కానీ ఆ ఆటంకాలు వారిని విడదీయలేవు వారి ఆకర్షణకు ఇంకా అనుబంధానికి ఇంకా బలపడే విధంగా చేస్తాయి.

     

      మిధున రాశి కుంభరాశి ఈ ఇరువు రాశులు కూడా సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరిని చేసుకున్నా కూడా వారి యొక్క అనుబంధాలు బాగానే ఉంటాయి. ఎందుకంటే వీరు ఇతరుల పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటారు. మీరు అనుబంధానికి ఎక్కువగా విలువనిస్తారు కనుక.

     సింహరాశి వారు మకరము మరియు కన్య రాశి గల వారిని వివాహము చేసుకున్నట్లయితే వారి యొక్క అనుకూలము అనేది చాలా తక్కువగా ఉంటుంది వారి మధ్య అనుబంధ బాంధవ్యాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు.

     సింహరాశి వారి యొక్క అదృష్టరంగులు

     సింహరాశి యొక్క గుర్తు సూర్యుడి గనుక సూర్యుడు అత్యంత ప్రకాశించినంతగా ఉంటాడు. కనుక వారు ఎక్కువగా పసుపుని ఎరుపు రంగుని ఊదా, నారింజ,బంగారం  ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.

     సింహరాశిలో పుట్టేవారు చాలామంది బంగారం రంగుని అదృష్టారంగా భావిస్తారు కానీ కొద్దిమంది మాత్రం ఎరుపు రంగుని అదృష్ట రంగుగా భావిస్తారు. 

     చరిత్రలో సింహరాశిలో పుట్టిన వారు 

     బారక్ ఒబామా : ఇతను ఆగస్టు నాలుగో తారీఖున జన్మించాడు. సింహరాశిలో పుట్టినవాడు ఇతరు నల్లజాతి వాడైనప్పటికీ అమెరికాని పాలించాడు అధ్యక్షుడు అయ్యే అందరి దృష్టికి గొప్ప పేరు సంపాదించాడు.

     

     

     వియోలా డేవిస్ : ఈమె ఆగస్టు 11వ తారీఖున జన్మించింది. అంటే సింహరాశిలోనే జన్మించింది ఈమె నటనకి నిజంగా జనాలు ఫిదా అయిపోతారు ఏమిటి అనేక ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి.

     పాప్ స్టార్ మడోన్న : ఏమీ ఆగస్టు 16వ తారీఖున జన్మించింది. ఈమె గొప్ప సంగీత దర్శకురాలు.ఏమి ఒక సంగీతానికి జనాలందరూ మైమర్చిపోయే విధంగా ఈమె పాడుతుంది. ఈమెకు  అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఈమె కూడా సింహరాశిలో జన్మించింది.

 

  •  

 

    •  

 

Akira Facts

AKira Facts shares amazing, verified facts daily—covering science, history, space, and more—to spark curiosity and inspire learning.

Related Post

Leave a Comment