text
Strawberry Moon కి గల ఏమైనా సంబంధం ఉందా ?:
ఇందులో మనము Strawberry Moon అంటే ఏమిటి అసలు ఆ పేరు ఎక్కడ వచ్చింది? ప్రాముఖ్యత ఏమిటి ?ఇప్పుడు ఆ పేరు పెట్టి పిలుస్తున్నారా ?అన్న రహస్యమైన జ్ఞానాన్ని పెంపొందించే విషయాలను మనము తెలుసుకుందాం.
|
1.స్ట్రాబెర్రీ మూన్ అంటే ఏమిటి?

- Strawberry Moon అంటే జూన్ నెలలో వచ్చే పౌర్ణమిని స్ట్రాబెరి మూన్ అని అంటారు .
- ఉత్తర అమెరికాలోని ప్రకృతిని ఆరాధిస్తున్న ప్రజలు జూన్ నెలలో స్ట్రాబెర్రీ ని పండించి కోతకు వచ్చే సమయం . ఆ పండ్లను పండించి ఫలితాన్ని ఇచ్చే సమయంలో వారికి అత్యంత అనందాన్నిచ్చే పౌర్ణమి సందర్భంలో 06 వ నెలలో వారు ఆకాశంలో అద్భుతమైన చంద్రునికి స్ట్రాబెర్రీ మూన్ అని పిలిచారు.
- కొన్ని లెక్కల ప్రకారం “ఈ “స్ట్రాబెర్రీ మూన్” పేరును ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లో నివసించే స్థానిక అమెరికన్ అల్గోన్క్వియన్ తెగలు అలాగే ఓజిబ్వే, డకోటా మరియు లకోటా ప్రజలు సేకరించడానికి సిద్ధంగా ఉన్న “జూన్-బేరింగ్” స్ట్రాబెర్రీల పక్వానికి గుర్తుగా ఉపయోగించారు.పసిఫిక్ సముద్ర తీరాన నివసించే హైడా తెగ దీనిని “బెర్రీస్ రైపెన్ మూన్” అని పిలిచింది.
2.పంట కాలాన్ని గుర్తించిన ఆలోచన ఏమిటి ?
- జూన్ నెలలో చెట్ల ఫలాలను ఇచ్చే సమయం కాబట్టి. ఆ నెలలో చంద్రుడు పౌర్ణమి సందర్భాన్ని పురష్కరించుకొని ఆ కాలాన్ని Strawberry Moon అని పిలిచారు.
- స్ట్రాబెర్రీ చంద్రుడు పంట కాలం ప్రారంభంలో వస్తుంది.
- జూన్ నుండి , మీరు బెర్రీలు, పండ్లు మరియు ఎండుగడ్డిని కోయవచ్చు, ఇది ఆహారాన్ని సమృద్హిగా సేకరించి ఆదాయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది.
3దీన్ని మొదట స్ట్రాబెర్రీ మూన్ అని ఎవరు పిలిచారు?
సమయాన్ని తెలుసుకోవడానికి చంద్రుని ఉపయోగించేవారు. దీనినే చంద్ర చక్రం అని పిలిచారు.
ప్రతి చంద్ర చక్రంలో 13 పౌర్ణమి చంద్రులు ఉంటాయి. ప్రతి చంద్ర చక్రానికి వారి అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులను బట్టి ఒక్కొక్క పేరు పెట్టారు.
ఉత్తర అమెరికా అల్గాన్‌క్విన్ తెగలు దీనిని Strawberry Moon అని పిలిచారు. పండ్ల కోత సమయం అని వారు గుర్తించడానికి.
స్ట్రాబెర్రీలు ఉత్తర అర్ధగోళానికి చెందినవారు తాము తినే ఆహారం లో వాడుకగా ఈ పండ్లను వాడేవారు.
ఈ చంద్ర చక్రాలకు ఒక్కొక్క పేరు పెట్టడం వలన సమయాన్ని పంటలు పండించడానికి లెక్క గట్టేవారు
ఈ పేరు వివిధ ఉత్తర అర్ధగోళ సంస్కృతులు మరియు తెగల నుండి వచ్చింది, ఎందుకంటే ప్రపంచంలోని ఈ విభాగంలో, అనేక చెట్లు మరియు పొదలు పూర్తిగా పండిన పండ్లతో చూడ ముచ్చటగా కప్పబడి ఉంటాయి, కోయడానికి అనుకూలంగా ఉంటాయి.
People ask questions:
1.చివరి స్ట్రాబెర్రీ మూన్ ఏ సంవత్సరంలో జరిగింది?
a.2006 సంవత్సరం లో ఉత్తర అర్ధ గోళంలో జరిగింది.
2.నేను స్ట్రాబెర్రీ మూన్ ఎప్పుడు చూడగలను?
2025 స్ట్రాబెర్రీ మూన్ జూన్ 11 బుధవారం సాయంత్రం 5:44 గంటలకు గరిష్ట ప్రకాశానికి చేరుకుంటుంది, కానీ దానిని వీక్షించడానికి ఉత్తమ సమయం చంద్రోదయం సమయంలోనే, ఇది చాలా ఆస్ట్రేలియన్ నగరాల్లో స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6:30 నుండి 7:00 గంటల మధ్య సంభవిస్తుంది.