వృషభ రాశి ఫలితాలు:

By Akira Facts

Updated on:

Follow Us

వృషభ రాశి ఫలితాలు:

Taurus Horoscope:వృషభ రాశి యొక్క జన్మస్థానం :

ఎవరైతే ఏప్రిల్ 20 మరియు మే 20 మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభరాశి చక్రము కిందకి  వస్తారు

://otieu.com/4/9453194

 

వృషభ రాశి వారి యొక్క పరిపాలన:

వృషభ రాశిని శుక్ర గ్రహము పరిపాలిస్తుంది. ఎద్దు ని దీని యొక్క గుర్తుగా భావిస్తారు.

వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం :

వృషభ రాశి వారు ఎటువంటి వారంటే ఆవలిస్తే పేగులు లెక్కపెట్టేటువంటి స్వభావం కలిగిన వారు చాలా తెలివిగా ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే వారు నిర్ణయాన్ని చాలా దృఢంగా తీసుకుంటారు. వృషభ రాశిలో పుట్టినటువంటి వారు మేష రాశి వారిని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. మీరు బాగా కష్టపడి పని చేస్తారు. పట్టుదల ఉంటుంది.
ఏదైనా ఒక పని విషయంలో అంకితభావం కలిగి ఎంతటి సమస్యనే నా ఎదుర్కొనే మనస్తత్వం కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని వీరు కోరుకుంటారు. సాధారణంగా ఎవరి జోలికి అయితే వెళ్ళరు కానీ ఎవరైనా తన జోలికి వస్తే ఎద్దు స్వభావం అనేది బయటపడుతుంది వాళ్లు గాని రెచ్చిపోతే వీళ్ళు అంతకంటే రెండింతలు బాగా రెచ్చిపోతారు.
వారు ఏదైనా ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నట్లైతే ఆ నమ్మకం పట్ల గట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటారు.ఎదుటివారు ఎంత చెప్పినా వినరు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీని వలన వాళ్ళ యొక్క స్నేహభావం అనేది కూడా దెబ్బతింటుంది.

మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు :

వృషభ రాశి చక్రము మేషము మరియు మిధున రాశి మధ్య వసంత రాసి చక్రాలలో ఉంటుంది. అందుకని జ్యోతిష్య శాస్త్రంలో వసంతకాలమనేది ముఖ్యమైనది.
వృషభ రాశి యొక్క చిహ్నము ఎద్దు. ఎద్దు యొక్క ఆకారము దృఢంగా ఉంటుంది. కదలలేని స్థితిలో ఉంటుంది సో ఇది ఏమి చెప్తుంది అంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వారు చాలా దృఢంగా ఉంటారు. ఏదైనా నిర్ణయాన్ని దృఢనిశ్చయంగా తీసుకుంటారు.
వృషభ రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు ఈ శుక్రుడు ప్రేమకు గుర్తుగా ఉంటాడు. వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ప్రేమగా ఉంటారని కూడా తెలియజేస్తుంది.
వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 6 మరియు 9.

వృషభ రాశి వారి యొక్క బలహీనతలు.

వృషభ రాశి వారు చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. రెండు రకాల మనస్తత్వాలను వారు కలిగి ఉంటారు నిర్ణయం అనేది మొదటగా ఏది తీసుకోవాలో అనేది వారు కరెక్ట్ గా తెలుసుకోలేరు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిని విడిచిపెట్టరు. ఇది ఒక రకమైన బలహీనత.
వారు ఉన్నదానితోనే సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు వీలైనంతవరకు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. చూసేవారికి ఇది అత్యాశ కలిగిన జీవితంగా వారికి అనిపిస్తుంది.

వృషభ రాశి వారి యొక్క వివాహం:

మకరం, కర్కాటకం , మీనం , వృశ్చికం మరియు కన్య రాశులు పుట్టిన వారు సరైన జోడి.
ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఏ రాశుల వారిని వివాహం చేసుకున్న సర్దుకుపోయే మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు. కావున ఈ రాశులలోని వారు ఏ రాశి వారినైనా వివాహం చేసుకున్న అంత ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు.

వృషభ రాశి వారికి ఇష్టమైన రంగులు:

పుట్టినటువంటి వారికి ఎరుపు మరియు గులాబీ రంగులు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రెండు రంగులు ప్రేమకు గుర్తులు అందుకని వృషభ రాశిలో ఉన్న వారు ఈ రెండు రంగులు ఇష్టపడతారు.
వృషభ రాశిలో పుట్టిన వారు సహజ సౌందర్యాన్ని కూడా ఇష్టపడతారు. సహజ సౌందర్యాన్ని తెలియజేసే నీలం ఆకుపచ్చ రంగులను వీరు ఇష్టపడతారు.

చరిత్రపరంగా వృషభ రాశిలో పుట్టిన వారు :

షేక్ స్పియర్ : ఏప్రిల్ 26వ తారీకున ఇతను జన్మించాడు ఇతను అనేక నాటకాలలో ప్రసిద్ధి చెందాడు.
2. గాయని కెల్లీ క్లార్క్సన్ : ఈమె ఏప్రిల్ 24 వ తారీఖున జన్మించారు. వృషభ రాశిలో జన్మించారు. సంగీతం లో ఈమె చాలా పేరు సంపాదించింది. అవార్డులు కూడా గెలుచుకుంది. ఈమె చేసిన షో ఆధారంగా పిల్లలు రచయితగా ఎలా మారాలో కూడా ఈ విషయం ఆధారంగా చాలామంది నేర్చుకున్నారు.ఈ విధంగా కూడా ఈమె మంచి పేరు సంపాదించుకున్నారు.
3. బార్బ్రా స్ట్రీసాండ్ : ఈమె ఏప్రిల్ 24 వ తారీఖున జన్మించింది. సిరి చరిత్రలో ఈమె ఒక ఉత్తమ దశకురాలుగా పేరుపొందింది ఈమెకు గోల్డెన్ గ్లోబల్ కూడా గెలుచుకుంది.
4.క్వీన్ ఎలిజబెత్: ట్వీన్ ఎలిజిబెత్ ఏప్రిల్ 21వ తారీఖున వృషభ రాశిలో జన్మించారు. ఏమి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చిన్నతనంలోనే 25 సంవత్సరాల వయసులోని రాణిగా పట్టాభిషేకం పొందింది.

Akira Facts

AKira Facts shares amazing, verified facts daily—covering science, history, space, and more—to spark curiosity and inspire learning.

Related Post

Leave a Comment