కన్య రాశి జన్మస్థానం : 12 రాసి చక్రాలలో కన్య రాశి చక్రం అనేది ఆరవ రాసిగా ఉంటుంది ఎవరైతే ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22వ తారీకు వరకు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్య రాశి చక్రం కిందికి వస్తారు.
#Virgo zodiac cycle facts :కన్య రాశి లక్షణాలు : మీరు కన్యా రాశి లో పుట్టినట్లయితే మీరు ఏదైనా ఒక విషయంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త విషయాలను కనిపెట్టడానికి అందులో నైపుణ్యము సంపాదించడానికి ఎక్కువ ఇష్టపడతారు. మరి దానికోసం ఎంతో కష్టపడతారు.
కన్య అని దేనిని పిలుస్తారంటే దాని ఉదాహరణకి భూమి తో పోల్చుకుంటారు. మనం సాధారణంగా వింటూ ఉంటాం కదా భూదేవి అని భూమాత అని భరతమాత అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఇది కన్య రాశి చక్రంలో ఉన్న వారు ఎక్కువగా దీనిని ఆపాదిస్తారు.ఎందుకంటే వారు కన్య రాశిలో పుట్టిన వారు. కాబట్టి ఈ భూదేవికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒకటి ఓపిక.రెండు నిబద్ధత ఈ రెండు లక్షణాలు భూదేవి కలిగి ఉంటుంది.
కన్య రాశి యొక్క ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం.
కన్య రాశిలో పుట్టినటువంటి వారు ఒక విషయాన్ని అయితే గమనిస్తారో అది ఏంటంటే తాను కష్టపడితేనే ఫలితం అన్న విషయాన్ని బాగా నమ్ముతారు అందుకని తను నమ్ముకున్న ప్రాజెక్టు కోసం రాత్రి పగళ్ళు కష్టపడి పని చేస్తారు నిద్రలేని రాత్రులు గడుపుతారు చిట్టచివరకు ఫలితం కోసము ఎండనక వాననక చాలా కష్టపడి పని చేస్తారు.
కన్యరాశిలో పుట్టిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. ఎవరైనా ఏదైనా పని ఇచ్చినప్పుడు వారిని కన్యరాశిలో పుట్టిన వారిని కచ్చితంగా పిలిపించడం అనేది మంచిదని జాతక శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎవరైనా ఏదైనా పని ఇచ్చినప్పుడు తమ బాధ్యతల పట్ల చాలా పట్టుదల కలిగి ఉంటారు. అంత ఈజీగా తమ బాధ్యతను అయితే మరిచిపోరు. ఎవరైతే పని ఇచ్చారో వారిని నిరాశ పరచరు.
ఏదైనా నేర్చుకోవాలని ఆసక్తి వారికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాటలు పట్ల సంగీతం పట్ల నటించడం పట్ల ఎక్కువ ఆసక్తిని వారు కలిగి ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు సృష్టించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు.
కన్య రాశిలో పుట్టిన వారు ఎక్కువ ఓపికను కలిగి ఉంటారు. వారికి కష్టాలు వస్తాయి ఎలా కష్టాలు వస్తాయి అంటే ఒక్కొక్కసారి ఓపిక సహించలేనటువంటి కష్టాలు కూడా వారికి రావచ్చు.అయినా ఇతను కంటే వారు ఎక్కువ ఓపికను కలిగి ఉంటారు.
కన్య రాశి వారిలో రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి ఏదైనా తప్పు జరిగినప్పుడు వారికి సరిదిద్దుకునే సమయం వారికి ఇస్తారు. రెండవది వారిలో ఉన్న మంచి లక్షణాలను కూడా వారు గుర్తిస్తారు.
కన్య రాశి వారు ఏదైనా ఒక నమ్మకాన్ని ఒక సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే దానిని పరిపూర్ణంగా వారు విశ్వసిస్తారు. అది ఒక్కొక్కసారి మంచి కావచ్చు.ఒక్కొక్కసారి చెడ్డ కావచ్చు ఈ లక్షణం వారికి ఉంటుంది.
ఉదాహరణకు చెప్పాలంటే కష్టేఫలైని సిద్ధాంతాన్ని వారు నమ్ముతారు కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇది చూసే వారికి చాలా విమర్శించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వారి దృష్టిలో అది కరెక్ట్ అయింది ఇతరుల దృష్టికి అది కరెక్ట్ అయింది కాదు. కానీ వారు బలముగాను మీద ఏంటంటే కష్టపడి పని చేయాలి అనేటువంటి తత్వం. ఇది ఒక్కొక్కసారి మంచి కావచ్చు ఒకసారి చదువు కూడా దారి తీయవచ్చు చెప్పలే ఇటువంటి గుణాన్ని కన్య రాశి వారిలో కనిపిస్తుంది.
కన్య రాశి చక్రాన్ని ఒక అందమైన కన్యకతో పోలుస్తారు. దీనికి గుర్తు ఏమిటంటే అమాయకత్వానికి,స్వచ్ఛమైన మనసుకి ఖచ్చితత్వానికి గుర్తు.
గ్రీకు పురాణాలలో కన్య రాశి చక్రము గురించి ఏమని చెప్తుంది అంటే చివరిసారిగా భూమిని విడిచిపెట్టినటువంటి దేవత కన్య అని గ్రీకు పురాణాల్లో వ్రాయబడి ఉంది.అందుకే కన్య రాశిని భూమి దేవత అని ఆరాధిస్తూ ఉంటారు.
కన్య రాశి చక్రాన్ని బుదురు పరిపాలిస్తాడు ఒక జ్యోతిష్యుడు కన్యారాశి చక్రంలో పరిపాలించే వారి గురించి ఏమని చెప్తాడు అంటే ఏదైనా ఒక విషయాన్ని అందులో ఉన్న సమస్య నుంచి బయటకు తెప్పించాలంటే దానిని హేతుబద్ధంగా ఆలోచించి సాక్షాలను సేకరించి పరిశీలించిన మెదటనే దానిని బయటికి తీసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అంతేకానీ ఎవరో చెప్పారని గుడ్డిగా అయితే అతను ఫాలో అవ్వడు అంతేకాకుండా ఎవరైతే కన్యారాశులకు పుట్టి ఉంటారు వారి యొక్క దినచర్యలు అసాధారణంగా ఉంటాయి.క్రమశిక్షణ కలిగి వారు ఉంటారు.
కన్యారాశి చక్రం వారు ఎప్పుడు వినయంగా విధేయతగా ఇతరుల పట్ల స్నేహభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారు తక్కువ దుస్తులు ధరిస్తారు. ఎక్కువ గొప్పలు చెప్పుకోరు ఇవి వారికున్న మంచి లక్షణాలు.
కన్యా రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి?
కన్య రాశిలో ఎవరైతే పుట్టి ఉంటారో వారు వృషభ రాశిలో పుట్టినటువంటి వారిని వివాహము చేసుకున్నట్లయితే వారి యొక్క జీవితము సంతోషంగా సుఖంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి.
కన్య రాశి వారు ఎవరిని వివాహము చేసుకోకూడదు?
తుల రాశి మరియు కుంభరాశిలో ఎవరైతే పుట్టి ఉంటారో వారు కన్యరాశుల వారితో కచ్చితంగా వివాహం అయితే చేసుకోకూడదు ఎందుకంటే వీరిలో తొందరపాటు తనుము ఎక్కువగా ఉంటుంది.చాలాసార్లు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. కుటుంబంలో సమాధానము నెమ్మది అనేది ఉండదు.
అంతేకాకుండా ధనస్సు సింహ మేషరాశి వారిలో వీరిని అగ్ని రాసులు అని అంటారు. కనుక వీరిలో అతి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యరాశిలో పుట్టినటువంటి వారితో ఎక్కువగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశుల వారిలో కూడా వివాహము చేసుకొనకూడదు.
కన్యరాసుల వారిని ఈ జంతువులతో పోలుస్తారు?
కన్యరాశులలో పుట్టిన వారిని నక్కని ఆత్మ జంతువుగా పోలుస్తారు ఎందుకంటే నక్క ప్రతి విషయంలో తప్పించుకునేటువంటి స్వభావము కలిగి ఉంటుంది జాగ్రత్త పడేటువంటి స్వభావం కలిగి ఉంటుంది కానీ రాత్రులలో పుట్టేటటువంటి వారు కూడా తప్పించుకునే స్వభావము జాగ్రత్త పడే స్వభావం అధికంగా ఉంటుంది కాబట్టి నక్కని ఆత్మ జంతువు గా వివరణ ఇస్తారు. రెండవదిగా తేనెటీగలని ఆత్మ జీవరాసులుగా పరిగణిస్తారు. ఎందుకంటే తేనెటీగలు కష్టపడి పనిచేసి తేనెను తయారుచేస్తాయి. అలాగే కన్య రాశిలో పుట్టినటువంటి వారు కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు. కనుక ఈ రెండు జంతువులని కన్య రాశి వారిలో పుట్టిన వారిని ఈ రెండు జంతువులతో పోలుస్తారు.
కన్యరాసులలో పుట్టిన వారి గురించి కొన్ని సరదా వాస్తవాలను తెలుసుకుందాం.
1. మైకేల్ జాక్సన్ : మైకల్ జాక్సన్ ఆగస్టు 29వ తారీకున జన్మించాడు ఈయన జీవితాన్ని మనం చూసినట్లయితే ఈయనకి సంగీతం పట్ల నృత్యం పట్ల ఆయనకి విపరీతమైన ఇష్టం పెరిగింది ఈయన చేసేటువంటి సంగీతానికి నృత్యానికి అనేకమంది ఈయనకు ఫిదా అయిపోయారు. ఒకసారి ఆయనకి స్టేజి మీదగా రాకపోతే ఆయనను చూసి ఫిదా అయిపోయిన వారందరూ ఏడ్చుకుంటూ ఆహ్వానించేవారు.అంతగా ప్రజల్ని ఆయన మైమరిపించాడు అందుకే ఇతని ప్రపంచ సూపర్ స్టార్ అని కూడా పిలిచారు.
2. అమీ వైన్ హౌస్ : ఈమె సెప్టెంబర్ 14 వ తారీకున జన్మించింది.2008వ సంవత్సరముల వరుసగా ఈమె ఐదు అవార్డులను గెలుచుకున్నది. ఈమె నృత్యం లో చాలా పాపులర్.
3. బిల్ ముర్రే : ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున జన్మించాడు ఈయన నటన చాలా విచిత్రంగా ఉంటుంది అందరూ దృష్టిని ఇతని ఆకర్షించే విధంగా ఉంటుంది చూసేదానికి చాలా నిర్లక్ష్యంగా నటిస్తున్నాడు అనిపిస్తుంది కానీ ఆ నిర్లక్ష్యపు ధోరణి ప్రజలను ఎంతో బాగా ఆకర్షిస్తుంది ఇతనితో మాట్లాడడానికి ఏజెంట్ ని ఎవరు నియమించుకోలేదు. డైరెక్ట్ గా అతనితో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ప్రజలు ఏ విధంగా నటించాలో అతనికి వాయిస్ మెసేజ్ లు పంపించిన తర్వాత అతను చాలామందికి కామెడీగా ఎలా నేర్పించాలో అనేది అనేక మందికి ఇతను నేర్పించారు.
4. కామెడాన్ రియాజ్ : ఇతను ఆగస్టు 30వ తారీఖున జన్మించాడు. ఈమెకు ముక్కుకు సంబంధించిన వ్యాధి అనేది వచ్చింది. అప్పుడు ముక్కుకు సంబంధించిన సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఈ మీ అందానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని ఆమె ముక్కుకి సర్జరీ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఆమె ముక్కుకి ఇంకా ఎక్కువగా నొప్పి వచ్చింది. ఆ తర్వాత నాలుగు సార్లు ముక్కుకి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.ఈ విధంగా ఆమె నటన కోసమో చాలా కష్టపడింది.